Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిగడపకూ రాహుల్ గాంధీ సందేశాన్ని తీసుకెళ్తాం
మాజీమంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
నవతెలంగాణ- వికారాబాద్ కలెక్టరేట్
వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్‌పేట్ మండలం వెల్చల్ గ్రామంలో బుధవారం ' హాత్ సే హాత్ జోడో' అభియాన్ కార్యక్రమన్ని ప్రారంభించిన మాజీ మం త్రి గడ్డం ప్రసాద్‌కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాహుల్‌గాంధీ భారత్ జోడో పాదయాత్ర స్పూర్తితో ఏఐ సీసీ, టీపీసీసీ అదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారం భించారని వికారాబాద్ నియోజకవర్గంలోని ప్రతీ గ్రామా నికి, ప్రతీ గడపకు రాహుల్ గాంధీ సందేశాన్ని తీసుకెళ్తా మని వరంగల్ రైతు డిక్లరేషన్ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్యల ప్ర జావ్యతిరేక విధానాలను ఎండగడుతూ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కె. సంతోష్ కుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పి. రఘువీరారెడ్డి, సీనియర్ నాయకు లు వి.సత్యనారాయణ, కిషన్‌నాయక్, రత్నారెడ్డి, మహి పాల్ రెడ్డి, నర్సింలు, పట్టణ అధ్యక్షుడు ఏ.సుధాకర్ రెడ్డి, వికారాబాద్ మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఎర్రవల్లి జాఫర్, వికారాబాద్ మండలాధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, శ్రీని వాస్ ముదిరాజ్, వికారాబాద్ నియోజకవర్గ సీనియర్ నా యకులు ప్రజా ప్రతినిధులు, పార్టీ అనుబంధసంఘాల నా యకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, యూత్ కాంగ్రెస్, సో షల్ మీడియా, బూత్ ఎన్‌రోలర్స్ నాయకులు కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.