Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ యూటీఎఫ్ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ -రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
అక్రమ బదిలీలను రద్దు చేయాలి.. జిల్లా ఉపాధ్యా యులకు న్యాయం చేయాలి టీఎస్ యూటీఎఫ్ రంగారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. సెక్రటేరియట్ ఉత్తర్వు లను రద్దు చేయాలి డిమాండ్ చేస్తూ బుధవారం ఉపా ధ్యాయుల పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలోకి అక్రమంగా, దొడ్డిదారిన వివిధ జిల్లా నుంచి సెక్రటేరియట్ ఆర్డర్స్ ద్వారా వచ్చి చేరుతున్న ఉపా ధ్యాయుల అక్రమ బదిలీల ఉపాద్యాయుల ఉత్తర్వులను ర ద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో కూడా ఒక పా ఠశాల నుంచి దగ్గరగా ఉన్న మరో పాఠశాలకు కూడా ఆర్డర్స్ తెచ్చుకొని సుదూర ప్రాంతంలో పనిచేస్తున్న వారికి అవకాశాలు లేకుండా చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాల న్నారు. దొడ్డిదారి బదిలీ ఆర్డర్స్ రద్దుచేసి వారిని వెనక్కి పంపాలని, జీవో 317తో స్థానికులు సుదూర ప్రాంతా లకు బదిలీ కావించబడ్డారు వారిని జిల్లాకు తీసుకరా వాలనీ డిమాండ్ చేశారు.