Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచి రెడ్డి ప్రశాంత్ రెడ్డి
- కొనసాగుతున్న ప్రగతి నివేదన యాత్ర
నవతెలంగాణ-మంచాల
తనను అభిమానించే ప్రజలను గుండెల్లో పెట్టి చూసుకుంటానని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తను చేపట్టిన ప్రగతి నివేదన యాత్ర 19వ రోజు మంచాల మండల పరిధిలోని తాళ్ళప ల్లిగూడలో గురువారం కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది కాలంలో గ్రామ అభివృద్ధికి రూ.8.41కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. అంబేద్కర్ భవనం చుట్టూ గోడ నిర్మాణానికి రూ.ఐదు లక్షలు ఎమ్మెల్యే మంజూరు చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారిని ఆదుకుంటోందన్నారు. ఇందులో భాగంగానే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కుకుడాల అంజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు చీరాల రమేష్, ఎంపీపీ జటోత్ నర్మద లచ్చిరాం, మండల ప్రధాన కార్యదర్శి కాట్రోత్ బహదూర్, సర్పంచ్ కుకుడాల శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ పేసరి గాయాల సుకన్య, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ దండేటికార్ రవి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మొద్దు సికిందర్‌రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు రాజేష్, ఏఎంసీ డైరక్టర్ ఎండి జానీపాషా, యువజన విభాగం మండల అధ్యక్ష, కార్యదర్శులు వనపర్తి బద్రీనాథ్ గుప్త, గంట విజరు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షు లు నల్ల ప్రభాకర్, విద్యార్థి విభాగం మండల అధ్యక్ష, కార్యదర్శులు బొట్టు ప్రవీణ్ నాయక్, ఆవుల ప్రశాంత్‌యాదవ్, జపాల్ ఉప సర్పంచ్ బకున మల్లప్ప, తదితరులు ఉన్నారు.