Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పుడు వార్తలను ఖండించిన బాలుడి తండ్రి నంద భీమయ్య
నవతెలంగాణ-దోమ
మండల పరిధిలోని బొంపల్లి గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం వికటించి ఓ బాలుడు మృతి చెందాడనే విషయంలో వాస్తవం లేదని బాలుడి తండ్రి నంద భీమయ్య తెలిపారు. గు రువారం గ్రామంలో ఎంపీటీసీ రాములు, ఉపసర్పంచ్ రఫీలతో కలిసి విలేకరుల సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యశ్వంత్(12) అనే బాలుడు ఆర్ఎంపీ వైద్యం వికటించే మృతి చెందినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని, అందులో వాస్తవం లేదన్నారు. బాలుడు అనారోగ్యా నికి గురైతే నగరానికి తీసుకు వెళ్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడని తెలిపారు. అదేవిధంగా తాము ఆర్ఎంపీ డాక్టర్తో కుమ్మకైనట్లు వస్తున్న వా ర్తల్లో వాస్తవం లేదన్నారు. షఫీ, నంద వెంకటయ్య, ముద్దం అంజనే యులు, శ్రీనివాస్, గోపాల్ పాల్గొన్నారు.