Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి
నవతెలంగాణ-పరిగి
స్థానిక ఎమ్మెల్యే వైఫల్యంతో పరిగి అభివృద్ధి కుంటుప డిందని మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జొడో యాత్ర సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్లుటకు హాత్ సే హాత్ జొడో యాత్రను గురువారం పూడూరు మండలం మన్నె గూడలో ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంత రం భారీ కాన్వారుతో మన్నెగూడ నుంచి పరిగి చేరుకు న్నారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం జెండాను ఎగర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దేశవ్యాప్తంగా హాత్ మే హాత్ జోడో కార్యక్రమాన్ని తీసుకువచ్చి దేశంలోని ప్రతి ఇంటింటికీ వెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారని తెలిపారు. అందులో భాగంగానే మండలాల నాయకుల ను, కార్యకర్తలను చైతన్యం చేసి ప్రతి గ్రామంలో చైతన్య యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ అమలకు ఆచరణ కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని అన్నారు. ముఖ్యంగా సీఎం కేసీ ఆర్ దళితున్ని ముఖ్యమంత్రి, దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తాన ని చెప్పి మోసం చేశాడని ఆరోపించారు. పాలమూరు రం గారెడ్డి ఎత్తిపోతల తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యా మలం చేస్తానని చెప్పి, నేటికీ పనులు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును పరిగి వరకు పొడిగించుకుంటే రీడిజన్ పేరుతో సీఎం కేసీఆర్ తన సొంత జిల్లాకు తీసుకువెళ్లాడని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పా నుంచి మన్నెగూడ వరకు నాలులు లైన్ల ర హదారి మంజూరీ చేయిస్తే ఇప్పటి వరకు పనులు ప్రారం భం కాలేదని అన్నారు. వికారాబాద్ నుంచి పరిగి, కోస్గి మీదుగా వెళ్లే రైల్వేలైన్‌ను కాంగ్రెస్ హాయంలో మంజూరీ చేయిస్తే కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. పరిగి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే, ఎంపీ విఫలం అయ్యారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి కె.హన్మంతు ముదిరాజ్, టౌన్ ప్రెసిడెంట్ ఎర్రగడ్డపల్లి కృష్ణ, నాయకులు భీం రెడ్డి, ఆంజనేయులు, విజరుకుమార్‌రెడ్డి, సురేందర్, నారాయణ, ఆనంద్‌గౌడ్, జగన్, రామకృష్ణారెడ్డి, అభిరాం, ఎజాస్, చిన్న నర్సింహులు, ఆంజనేయలు, శివకుకుమార్, తదితరులు పాల్గొన్నారు.