Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐ లింగయ్య
నవతెలంగాణ-యాచారం
మైనర్లకు ఎట్టి పరిస్థితిలో వాహనాలను ఇవ్వొద్దని సీఐ లింగయ్య హెచ్చరించారు. శనివారం యాచారం బస్టాండ్ సెంటర్లో ఆటో డ్రైవర్లకు, ఇతర వాహనాల డ్రైవర్లకు రోడ్డు నిబంధనలపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ డ్రైవర్ పక్క సీటులో ఎలాంటి ప్యాసింజర్‌ను కూర్చోబెట్టుకోవద్దని తెలిపారు. వాహనాలకు సంబంధించిన ఆర్సీ, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని చెప్పారు. వాహనాల ఓనర్లు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికే తమ వెహికల్‌ను ఇవ్వాలని కోరారు. ఆటో డ్రైవర్లు వెనకాల ఉన్న డోరును మూసివేసి ప్యాసింజర్‌ను ఎక్కించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు వి.ప్రసాద్, వెంకటనారాయణ, పోలీస్ సిబ్బంది, వాహనాల డ్రైవర్లు, తదితరులు పాల్గొన్నారు.