Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే
- కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హనుమంతరావు
నవతెలంగాణ-యాచారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి వెబ్సైట్ రైతుల పాలిట శాపంగా మారిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు. శనివారం యాచారం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కోదండ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి పోర్టల్ అస్తవ్యస్తంగా తయారై సమస్యల వలయంగా తయారైందని మండి పడ్డారు. ఇది వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్న భూములు అన్ని కబ్జా కోరల్లో చిక్కుకున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ధరణి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకుంటుందని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల సమస్యలు పరిష్కా రం కాక రెవెన్యూ కార్యాలయం చుట్టూ, మీసేవ కేంద్రాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారని తెలిపారు. పేద రైతులను రెవెన్యూ అధికారులు, మీసేవ సెంటర్ నిర్వాహకులు నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.