Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేవెళ్ల
వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మిర్జాగూడ సర్పంచ్ యు.భీమయ్య అన్నారు. శనివారం చేవెళ్ల మండల పరిధిలోని మిర్జాగూడ గ్రామంలో వెల్ స్పన్ ఫౌండేషన్, పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ వారి సహకారంతో మహిళా అభ్యుదయ సంఘం సభ్యులు పద్మావతి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ యు.భీమయ్య హాజరై, మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటిని, ఇంటి పరిసరాల్లో పరిశుభ్రత ప్రాధాన్యతనివ్వాలన్నారు. ప్రజలం దరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందన్నారు. చాలా మంది ప్రజలకు వారి ఆరోగ్యం ఎలా ఉందో తెలియని పరిస్థితి ఉందనీ, వారందరికీ వైద్య పరీక్షలు చేసి, మందులు అందజేసినట్టు వెల్లడించారు.ఈ వైద్య శిబిరం తమ గ్రామంలో ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కళాశాల డీజీఎం సుమన్ కుమార్ మాట్లాడుతూ వైద్య శిబిరంలో 301 మంది వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు. వారికి మందులను పంపిణీ చేయగా, మరో 34 మందిని ఆపరేషన్ నిమిత్తం రిఫేర్ చేశారు. వారిని సోమవారం ఆపరేషన్ చేసేందుకు వ్యాన్లు పంపించినామనీ, ఆపరేషన్లు ఉచితంగా చేస్తా మన్నారు. ఈ కార్యక్రమంలో డబ్లుఎఫ్హెచ్ కెె. ప్రాజెక్టు మేనేజర్ భద్రయ్య, వైద్యులు, సిబ్బంది, పాల్గొన్నారు.