Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య
నవతెలంగాణ-చేవెళ్ల
అర్హులైన నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇచ్చే వరకూ పోరాడు తామని సీపీఐ కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. చేవెళ్ల పట్టణంలో నిర్వహించిన భారత కమ్యూనిస్టు పార్టీ విస్తృత కౌన్సిల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై, మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ప్రభుత్వం అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు,ఇండ్ల స్థలాలు ఇస్తామని హామీ నిచ్చి, అమలు చేయడంలో విఫలమైందన్నారు. జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని జిల్లాలో పలుచోట్ల భూ కబ్జాలకు పాల్పడినట్టు తెలిపారు. కబ్జాదారుల నుంచి భూములను కాపాడి పేదలకు ఇండ్ల స్థలాల కోసం కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం వల్ల బతకలేని పరిస్థితులు ఏర్పడినాయని ఇలాంటి పరిస్థితుల్లో అద్దె ఇండ్లలో ఉంటూ బతుకుతున్న పేదల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ప్రభుత్వం అర్థం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వకపోతే రాబోయే కాలంలో సీపీఐ ఆధ్వర్యంలో భూ పోరాటాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కె. రామస్వామి, ప్రభులింగం, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ, ఏఐకేఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుధాకర్‌గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు బి. సుభాన్‌రెడ్డి, బీకేఎంయూ జిల్లా అధ్య క్షులు జే అంజయ్య, సీపీఐ చేవెళ్ల మండల కార్యదర్శి సత్తిరెడ్డి, సహాయ కార్యదర్శి ఎండి మక్బుల్, శంకర్పల్లి మండల కార్యదర్శి సుధీర్, మొయినాబాద్ మండల కార్యదర్శి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి జలీల్, ఏఐటీయూసీ మండల అధ్యక్షులు శివ, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మంజుల, మాధవి, విజయమ్మ, యాదమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మల్లేష్, చంద్రయ్య, గ్రామ కార్యదర్శులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.