Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభినందించిన కళాశాల అధ్యాపక బృందం
నవతెలంగాణ-కొడంగల్
ఉపాధ్యాయులైన నిత్య విద్యార్థిగా ఉంటూ పీహెచ్డీ సాధించడం గొప్ప విషయమని కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ రఫియా ఖానమ్ అన్నారు. కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అర్థశాస్త్రం బోధిస్తున్న జైపాల్ నాయక్ అధ్యాపకుడికి 'ఆశా వర్కర్' అనే అంశంపై పరిశోధన చేసి తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. డాక్టరేట్ పట్టా పొందిన జైపాల్ నాయక్‌కు వారి తల్లిదండ్రులకు కళాశాల అధ్యాపక బృందం శాలువాతో ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశౄల ఇన్చార్జి ప్రిన్సిపాల్ రఫీయా మాట్లాడుతూ పీహెచ్డీ చేసి డాక్టరేట్ సాధించడం స్ఫూర్తిదాయకమని, వీరిని నేటితరం విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రాంబాబు, రమే ష్ బాబు, సోమ్లా, శ్రీనివాస్, శ్రీధర్, అన్నపూర్ణ, రమేష్, అనంతయ్య, నరసింహులు, కేశవులు, శ్రీధర్, విద్యార్థులు పాల్గొన్నారు.