Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు సంబం ధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు.సోమవారం కలెక్టర్ కార్యాల యంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులు, ప్రజల సమస్యలపై 251 ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేసి వచ్చిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి, ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. అంతకు ముందు కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ, క్యాంటీన్లో నాణ్య మైన ఆహారంతో పాటు, స్వచ్ఛమైన తాగునీరు అందిం చాలని అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదన కలెక్టర్ రాహుల్ శర్మ, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.