Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్
నవతెలంగాణ-కేశంపేట
ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలు ఇచ్చిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ విమర్శించారు. గురువారం హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా కేశంపేట మండలం చౌలపల్లి, సంతాపూర్, కొనయపల్లి గ్రామాలలో పార్టీ మండల అధ్యక్షుడు గూడ వీరేశం ఆధ్వర్యంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ మాట ఇచ్చి మోసం చేసిన పార్టీలకు తగిన బుద్ది చెప్పేందుకే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ల పిలుపుమేరకు పార్టీ చేయి చేయి కలిపి గడప గడపకూ వెళ్లి ప్రజల కష్టాలును తెలుసుకునేందుకే హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమం చేపట్టామన్నారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రైతులను, పేదలను ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హయంలోనే పేదలకు న్యాయం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య యాదవ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఫిషర్ మెన్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ తుమ్మల గోపాల్ ముదిరాజ్, షాద్నగర్ నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు జూలపల్లి అనసూయ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు రూప, బ్లాక్, నాయకులు జగదీశ్వర్, బాబరాన్, శ్రీధర్ రెడ్డి, గిరి యాదవ్, కర్ణాకర్రెడ్డి, విజయరెడ్డి, రావుల పెంటయ్య ముదిరాజ్, రమేష్, అర్జున్, లక్ష్మణ్, రాఘవేంద్రరావు, సీతయ్య, చెన్నయ్య, రఘుగౌడ్ పాల్గొన్నారు.