Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
బీఆర్ఎస్కు చెందిన మంకాల దాసు, ఉద్యమ నాయకులు బోసుపల్లి వీరేశ్ కారును వీడి కాంగ్రెస్‌లో చేరారు. వారికి మల్రెడ్డి రంగారెడ్డి పార్టీ శాలువాలు కప్పి ఆహ్వానిం చారు. అంతక ముందు ఇబ్రహీంపట్నం చౌరస్తాలో భారీ ర్యాలీ నిర్వహించారు. అం బేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి అనం తరం హయత్‌నగర్ మండలం పరిధిలోని కుంట్లూరుకు ర్యాలీగా బయలుదేరారు. రంగారెడ్డి స్వగృహంలో పార్టీలో చేరారు. బో సుపల్లి వీరేశ్ ఇబ్రహీంపట్నం మండలం బీఆర్ఎస్ అధ్యక్షులుగా పనిచేశారు. తెలంగా ణ ఉద్యమ కాలంలోనూ క్రియాశీలక పాత్ర పోషించారు. ఎవరూ లేని సమయంలోనూ తెలంగాణ నాదాన్ని ప్రజల్లోకి తీసుకుపో యారు. కాగా కొంతకాలంగా ఆయనకు పార్టీలో సముచిత స్థానం లభించకపోవ డంతో ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నారు. కాగా ఇటీవల తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు జరుగుతున్న అన్యాయాన్ని సైతం వెలిగెత్తి చాటారు. కాగా మంకాల దాసు గత శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. 2018 శాసనసభ ఎన్నికల్లో క్యామ మల్లేష్ కాంగ్రెస్‌ని వీడి బీఆర్ఎస్లో చేరారు. క్యామ మల్లేష్ అనుచరుడిగా ముద్రపడిన మంకాల దాసు సైతం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గత మండల పరిషత్ ఎన్నికల్లో ఎంపీపీ, జడ్పీటీసీ పదవులను ఆశించారు. కానీ బీఆర్ఎస్ అధిష్టానం ఆయనకు మార్కెట్ కమిటీ ఆశ చూపి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించలేదు. సరికదా మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్నిక విషయంలోనూ చివరి వరకు మంకాల దాసే చైర్మన్ అభ్యర్థిగా నియమించే అవకాశాలు ఉన్నాయని, దాదాపు ఖరారు అయినట్లు ప్రచారం కూడా సాగింది. కానీ సుదీర్ఘకాలం తర్వాత మంఖాల దాసుకు బీఆర్ఎస్ అధిష్టానం చేయి ఇవ్వడంతో ఇటీవల ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రలోనూ ఆయన భాగస్వాములు కాలేదు. చివరకు తన అనుచరులతో కలిసి మల్ రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ చేరిక సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆయన కుమారుడు బంటిపై పలు ఆరోపణలు చేశారు.