Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏకకాలంలోనే రూ.2లక్షల రుణమాఫీ
- కౌలు రైతులకు కూడా
- రైతుబంధు అందజేస్తాం
- మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
నవతెలంగాణ-దారుర్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వంట గ్యాస్ ధర రూ. 500 చేస్తామని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా గురువారం మండలం పరిధిలోని నాగసాన్పల్లి, తరిగోపుల గ్రామాల్లో మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ పర్యటించారు. గ్రామంలో ఉన్న యువత బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని ఇంటింటికీ తిరుగుతూ, రైతు డిక్లరేషన్ గురించి వివరించి, భవిష్యత్తులో చేసే అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. లావని పట్టా భూముల యజమానికి హక్కు కల్పిస్తామన్నారు. ఏకకాలంలో రూ.2 లక్షలు రుణ మాఫీ చేస్తామనీ, రైతుబంధు రూ. 15 వేలు అందజేస్తామని తెలిపారు. కౌలు రైతులకు కూడా రైతుబంధు అందజేస్తామని చెప్పారు.ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి మొదటి ప్రాధన్యతో ఓటేసి, గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జాతీయ సభ్యులు కొలుకుంద సంతోష్, మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, ధరూర్ ఉపసర్పంచ్ రాజేశ్వర్, సీనియర్ నాయకులు కిషోర్, గఫర్, జమీల్ ధర్మపుర్ సర్పంచ్ అనిల్, అయూబ్ అన్సారి, కాంగ్రెస్ నాయకులు,యువత, కార్యకర్తలు పాల్గొన్నారు