Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్
నవతెలంగాణ-ఆమనగల్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్ యాదవ్ అన్నారు. మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ అనారోగ్యంతో బాధపడుతూ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ నేపథ్యంలో ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా, మంజూరైన రూ.లక్షా ఎల్వోసీ చెక్కును బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనా రోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగించుకోవానలి కోరారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
కడ్తాల్ మండల కేంద్రానికి చెందిన కె.మల్లయ్య అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మల్లయ్య మృత దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. బాధిత కుటుం బాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ రామకృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ లాయఖ్ అలి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.