Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంఘం అధ్యక్షులు రాజిరెడ్డి
నవతెలంగాణ-దోమ
విద్యార్థులు క్రమ శిక్షణతోనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని, వ్యక్తిగత నాలెడ్జ్ పెంచుకుంటూ తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలని దోమ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు కె.రాజిరెడ్డి అన్నారు. గురువారం దోమ ప్రభుత్వ కళాశాలలో చదువు కుంటున్న విద్యార్థులకు 'మేము సైతం యువత కోసం' కార్యక్రమంపై ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్, మండల మైనార్టీ కో-ఆప్షన్ సభ్యులు ఖాజాపాష, వార్డు మెంబర్ మైనోద్దీన్ ఆధ్వర్యంలో ప్రధాన వక్త సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ సేవక్ కుమార్తో మూడు గంటలపాటు కళాశాల విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు యువతకు చాలా అవసరమని కళాశాల ప్రిన్సిపాల్ మంజూల తెలిపారు. విద్యార్థులు తల్లీ దండ్రులతో విద్య నేర్పించిన గురువులతో వినయంగా ఉంటూ, వారి సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచిం చారు. ఈలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు సృజనాత్మకత పెంపొందుతోందన్నారు. ఈ కార్యక్ర మంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు చాలా అంశాలు నేర్చుకున్నామని హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మంజుల, అధ్యాపకులు సునీత,నాజీనిన్ శ్రీధర్,కుమార్, సురేష్ హరికృష్ణ , విద్యార్థులు పాల్గొన్నారు.