Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్పల్లి
మండలం పట్లూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీఆంజనేయ స్వామి ఆలయంలో బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గురు వారం స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నందున మందిర ప్రారంభో త్సవానికి హాజరు కాలేకపోయిన ఎమ్మెల్యే గురువారం ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ దేవర దేశి అశోక్‌తో కలిసి స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులకు ఆలయ నిర్మాణ కమిటీ చైర్మెన్ దేవర దేశి అశోక్ శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, సీనియర్ నాయకులు ప్రభాకర్ గుప్తా, పార్టీ మండలాధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు నాయబ్ గౌడ్, పట్లూర్ అధ్యక్షులు అశోక్, మోహన్, శంకర్, గ్రామ పెద్దలు, కార్యకర్తలు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.