Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లతో వీసీ
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
ఈ నెల 26 నాటికి పట్టణ ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు, పోడు భూములు ప్రభుత్వ జిఓల ప్రకారం చేయాల్సిన క్రమబద్దీకరణ, తెలంగాణకు హరితహారం, రెండు పడక గదుల నిర్మాణాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వ హించి సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వికారాబా ద్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, డీఆర్వో అశోక్ కుమార్, డీపీఓ తరుణ్‌కుమార్, డీఆర్డీఓ కృష్ణన్, డీటీడబ్ల్యూఓ కోటాజి, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ లాల్ సింగ్, ఆర్డీవో విజరు కుమారి, పరిగి కొడంగల్, వికారాబాద్ మున్సిపల్ కమిషనర్లు శ్రీనివాసన్, పవన్ కుమార్, శరత్ చంద్ర, అటవీ శాఖ అధికారి అరుణ తదితరులు పాల్గొన్నారు.