Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్
- రేఖ్యతాండాలో ముగిసిన
- జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్
నవతెలంగాణ-ఆమనగల్
గెలుపోటములను సమానంగా స్వీకరించిన వారే ఆసలైన క్రీడాకారులని జిల్లా పరిషత్ గ్రామీణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు, కడ్తాల్ మండల జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్నాయక్ అన్నారు. కడ్తాల్ మం డలంలోని రేఖ్య తాండాలో సేవాలాల్ జయంతి సందర్భం గా పది రోజులుగా కొనసాగుతున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్ హాజరై మాట్లాడారు. మొదటి స్థానంలో నిలిచిన తలకొండపల్లి టీంకు స్థానిక సర్పంచ్ హరిచంద్ నాయక్ రూ.40,116లు తోపాటు ట్రోఫీని అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలి చిన రేఖ్య తాండా టీంకు కృష్ణనాయక్ రూ.20,116లు నగదుతో పాటు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు లచ్చిరామ్ నాయక్, మం జుల చంద్రమౌళి, మక్తమాధారం సర్పంచ్ ముద్వెంటి సులోచన సాయిలు, పీఏసీఎస్ డైరెక్టర్ సేవ్యా నాయక్, వార్డు సభ్యులు కుట్యా, కృష్ణనాయక్, నాయకులు రాములు, జంగయ్య, సక్రు, చెన్నయ్య, రమేష్ పాల్గొన్నారు.