Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బషీరాబాద్
ప్రభుత్వ ఆస్పత్రిని ఆదివారం ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ సందర్శించారు. ఇటీవలే బషీరాబాద్ మండలానికి చెందిన మరాఠీ కాలనీకి చెందిన యువకుడు కడం నితిన్ కుమార్ (17) పాముకాటుకు గురై మండలంలోని ప్రభుత్వ ఆస్పత్రికి రాగా ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది చికిత్స చేయకుం డా స్నేక్ బైట్ వీనం అందుబాటులో లేదని తాండూర్ వెళ్ళండి అని చెప్పారు. బాలుడు పరిస్థితి విషమంగా మార డంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వ ఆస్ప త్రికి తరలించారు. ప్రస్తుతం వికారాబాద్‌లోని ఓ ప్రయి వేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయాన్ని తెలుసుకున్న ఎంపీపీ, ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది, వైద్యుల తో ఆదివారం మాట్లాడి నిర్లక్ష్యం చేసిన ఆస్పత్రి సిబ్బంది జగదీష్‌ని సస్పెండ్ చేయాలని డీఎంహెచ్ఓకు తెలిపారు. కార్యక్రమంలో బషీరాబాద్ సర్పంచ్ ప్రియాంక శ్రవణ్ కు మార్, బషీరాబాద్ గ్రామ యువకులు అనూప్ ప్రసాద్, రియాజ్, నరసింహులు, నరేష్, ఇషాక్, ధనరాజ్, సంతోష్, చిన్న లక్ష్మీకాంత్,గ్రామ యువకులు పాల్గొన్నారు.