Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేతనాలు రాకపోతే జీవనం గడిపేదెలా?
- 5 నెలలు దాటినా రాని వేతనాలు
- ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న పంచాయతీ కార్మికులు
- సీఐటీయూ మండల కన్వీనర్ పోచమోనీ కృష్ణ
నవతెలంగాణ-మంచాల
గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతి నెలా 5వ తేదీలోపు వేతనాలు ఇవ్వాలని సీఐటీయూ మండల కన్వీనర్ పోచమోనీ కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో ఎంపీవో తేజ్ సింగ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామాల్లో ఉదయం నుంచిి సాయంత్రం వరకు చాకిరి చేస్తూ, చాలీచాలని వేతనాలతో దుర్బర జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వచ్చే జీతం కూడా ట్రెజరీలో ఫ్రీజింగ్ ఉండటంతో 5 నెలలకోసారి రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న ప్రతి ఉద్యోగికీ వేతనాలు ఒకటోవ తేదీన వస్తుంటే, కార్మికుల జీతాలపై ఫ్రీజింగ్ ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. ప్రతి నెలా పంచా యతీ కార్యదర్శులు చెక్కులు రాసి, ట్రెజరీకు పంపిస్తే, ఫ్రీజింగ్ వల్ల 5 నెలలు దాటినా జీతాల చెక్కులు పాస్ కావడం లేదన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, ఫ్రీజింగ్ ఎత్తి వేసి, గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతి నెలా ఐదోవ తేదీన ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతకుముందు మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి, ఎంపీవో తేజ్సింగ్కు వినతిపత్రం అంద జేశారు. లేనియేడ సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులను ఐక్యం చేసి, జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఖాజా పాషా, జంగయ్య, రవి, దాసు, చెన్నయ్య, శంకర్, యాదయ్య, సురేష్, ప్రభాకర్, హరి, వెంకటయ్య, నర్సింహ, సుజాత, నర్సమ్మ, లక్ష్మి, బాలమణి, సుగుణ తదితరులు ఉన్నారు.