Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్
నవతెలంగాణ-షాద్‌నగర్
రైౖతులకు భరోసానిచ్చే ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు.ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని హాజీపల్లి, కిషన్‌నగర్, విట్యాల, విట్యాలతండా, గ్రామాల్లో పార్టీ మండల అధ్యక్షులు ఆశన్నగౌడ్ ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడోయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తూ, బడా బాబులకు దోచి పెడుతున్నాయని దుయ్యబట్టారు.తెలంగాణలో ఏర్పడ్డాక నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఒక్క కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తెలంగాణను అందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలను ఓడించి, తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మెంబర్లు, బ్లాక్ కాంగ్రెస్, కిసాన్ కాంగ్రెస్, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, మహిళా కాంగ్రెస్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్, బీసీ సెల్, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.