Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
నవతెలంగాణ-చేవెళ్ల
ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండోవ విడత 'కంటి వెలుగు'ను ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. సోమవారం చేవెళ్ల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి కండ్లు బాగుండాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ కంటి వెలుగు కార్యక్రమం చేపట్టిందన్నారు. వంద రోజుల వరకు అన్ని గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేసి, అవసరం మెరకు కండ్ల అద్దాలు, మందులు అందజేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం మండలంలో విస్తృతంగా కొనసాగు తోందన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ మాల్గారి విజయలక్ష్మి రమణారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు మాలతి కృష్ణారెడ్డి, చేవెళ్ల పీఎసీఎస్ చైర్మెన్ దేవర వెంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ బండారు శైలజ రెడ్డి, చేవెళ్ల మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు శేరి శివారెడ్డి, చేవెళ్ల ఎంపీటీసీ సభ్యుడు గుండాల రాములు, ఉప సర్పంచ్ గంగి యాదయ్య, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.