Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) డిమాండ్
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
వికారాబాద్ పట్టణానికి చెందిన హ మాలీ కార్మికులకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు. సోమవారం కార్మికులతో కలిసి కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యూ గంజి మార్కెట్ యార్డులో 30ఏండ్లుగా హమాలీ కార్మికులు పనిచేస్తున్నా రని అన్నారు. ఇప్పటి వరకు సొంత ఇండ్లు లేక అద్దె ఇండ్లలో ఉంటున్నారని తెలిపారు. 2014 లో అప్పటి కలెక్టర్ ఆమ్రపాలి ఇండ్లు ఇవ్వడానికి సర్వే కూడా చేశారని గుర్తు చేశారు. కానీ ఇండ్లు ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇండ్లు మంజూరు చేయాలని కోరా రు. ఈ కార్యక్రమంలో బాలరాజు, శంకరమ్మ, అనంత, శా రదా, జ్యోతి అంజమ్మ, పుణ్యమ్మ్, అనుసుజ, యాదమ్మ, మల్లమ్మ, రాజమని, బాలమని, చెందరకల, నాగమణి, మినాక్సీ, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.
కాస్తులో ఉన్న రైతులకు పట్టాలు ఇవ్వాలి
కాస్తులో ఉన్న రైతులకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ (ఎం) డిమాండ్ చేసింది. సోమవారం బాధితులతో కలిసి కలెక్టర్‌ను వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామానికి చెందిన 200 కుటుం బాలు వంద ఎకరాల్లో సాగు చేసుకుంటున్నారని అన్నారు. రెవెన్యూ, ఫారెస్టు వారు జాయింట్ సర్వే చేసి పట్టాలు ఇసా ్తమని చెప్పినట్టు తెలిపారు. కానీ ఇప్పటి వరకు ఇవ్వలేద న్నారు. వెంటనే బాధితులకు న్యాయం చేయా లని కోరారు. ఈ కార్యక్రమంలో నాయ కులు బాలరాజు, రాములు, శ్యామ్, ఆనంతయ్య. చంద్రన్న, శ్రీనివాస్, బుచ్చన్న, తదితరులు పాల్గొన్నారు.