Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, వార్డ్ కౌన్సిలర్ సల్మా జుబేర్ లాల
నవతెలంగాణ-తాండూరు
ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకో వాలని తాండూరు తాండూరు మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి వార్డ్ కౌన్సిలర్ సల్మా జుబేర్లాల అన్నారు. సోమవారం తాండూర్ మున్సిపల్ పరిధి లోని 21 వార్డులో కొనసాగుతున్న 'కంటి వైద్య' శిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఈ సంద ర్భంగా మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, వార్డు కౌన్సిలర్ సల్మా జుబేర్లాల మాట్లాడుతూ..ప్రజల ఆరోగ్యం పై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరు గైన వైద్య సేవలు అందించడంతో పాటు కంటిస మస్యలను పరిష్కరించేందుకు 'కంటివెలుగు' రెండో విడత కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. 100 రోజుల పాటు నిర్వహించే ఈ 'కంటి వె లుగు' కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసు కోవాలని సూచించారు. 'కంటివెలుగు' కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్ర మం లో జుబేర్లాల, ఆరోగ్యశాఖ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.