Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రిన్సిపాల్ శంకర్‌బాబు
నవతెలంగాణ-కొడంగల్
పిల్లాడికి తల్లిపాలు ఎంత శ్రేష్టమో మనిషికి మాతృ భాష అంతే శ్రేష్టం అని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శంకర్ బాబు అన్నారు, కోడంగల్ లోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ మాతభాషా దినోత్సవ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు క్విజ్ పోటీలు, పాటలు, కవి తలు, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. తెలుగు ఉపాధ్యా యులు ఎం. లక్ష్మణ్, శ్రీనివాసమూర్తి అధ్యక్షతన మాతృ భా ష దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ శంకర్‌బాబు మాట్లాడుతూ చంటిపిల్లాడు పసి తనంలో నేర్చుకునే భాష మాతృభాష అన్నారు. బిడ్డకు తొలి బడితల్లి ఒడే అన్నారు. తన తల్లిని ఎవరు చెప్పకుం డానే అమ్మ అని బిడ్డ ఎలా పిలుస్తాడో, మాతృభాష కూడా అంతే అన్నారు. ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతంలో మా ట్లాడే భాష వారికి మాతృభాష అయితే మనకు మాతృభాష తెలుగు అవుతుందన్నారు. తల్లికి ఇచ్చే గౌరవాన్ని మాతృభా షకు ఇవ్వాలన్నారు. మాతృభాష లేనిదే మానవజాతి వికాసం లేదన్నారు. మనిషి ఎన్ని భాషలు నేర్చుకున్నప్పటికీ మాతృభాషలో ప్రావీణులు కానివాడు విజ్ఞాన సమపార్జన చేయలేడన్నారు. మాతృభాష మనకు ఎందుకు గొప్పదంటే మన సంస్కృతి, ఆచారం, కుటుంబ పద్ధతులు అన్ని మాతృ భాషలోనే పరిచయమవుతాయన్నారు. అనేకమంది మహా మహులు తెలుగులో అనే రచనలు చేసి జాతి గౌరవాన్ని, బాషాస్థాయిని ఆకాశానికి పెంచారన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన నిర్వహించాలని యునెస్కో 30వ సాధారణ మహాసభ ప్రకటించిందన్నారు. 2000 సంవత్సరం నుంచి ఏటా మాతృభాష పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్ జనరల్ ప్రకటిస్తూ వస్తున్నారన్నారు. బెంగాలీ భాషకు తగిన గుర్తింపు ఇవ్వాలని అక్కడి ప్రజలు ఉద్యమ బాట పట్టారన్నారు. 1952 నుంచి 4 ఏళ్ల పాటు సాగిన ఉద్యమంలో బెంగాలీలు పాల్గొంటే పాకిస్తాన్ ప్రభుత్వం విన్నపాన్ని తిరస్కరించడమే కాకుండా పోలీసులు కాల్పులు జరిపించడంతో నెత్తురు ఏరులై పారిందన్నారు. మాతృ భా ష పరిరక్షణ కోసం నలుగురు యువకులు అసువులు బా సారన్నారు. 1956లో బెంగాలీ, ఉర్దూ భాషలను అధికార భాషలుగా గుర్తించిందన్నారు. భాషా సాంస్కృతిక వైవిధ్యా న్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవన వైవిధ్యాన్ని కాపాడుకోగలమన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రశేఖర్, హనుమంతు, మహమ్మద్ అలీ, నరేష్, సురేష్, లక్ష్మి, అనురాధ తదితరులు పాల్గొన్నారు.