Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేవెళ్ల
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ముడిమ్యాల్ గ్రామ సర్పంచ్ శేరి స్వర్ణలత దర్శన్ అన్నారు. మంగళవారం చేవెళ్ల మండల పరిధిలోని ముడిమ్యాల్ గ్రామంలో డ్వాక్రా మహిళా సంఘాలకు గ్రామ సర్పంచ్ శేరి స్వర్ణలత దర్శన్ డ్వాక్రా మహిళలకు లాప్ టాప్, 60 కుర్చీలు, గ్రీన్ మ్యాట్లు, టేబుల్స్, డ్వాక్రా భవనానికి పెయింటింగ్, లైట్స్, ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మహిళలు డ్వాక్రా సంఘం డబ్బు పొదుపుతో పాటు, మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండాలన్నారు. మన దేశంలో తొలి ప్రధాని ఇందిరా గాంధీ, మన దేశ తొలి రాష్ట్రపతి ప్రతిభ పటేల్, మన సుప్రీంకోర్టు తొలి జస్టిస్ మహిళా ఫాతిమా బివి, ప్రస్తుతం మన రాష్ట్రపతి. ద్రౌపతి ముర్ము, ఇలా ఎంతో మంది మహిళలు, ఎన్నో రంగాల్లో ముందంజలో ఉన్నారని తెలిపారు. అదేవిధంగా మహిళలు రాజకీయంగా పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకూ ఎదగాలని కోరారు. కార్యక్రమంలో డ్వాక్రా గ్రూప్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు. కార్యదర్శులు, కోశాధికారులు, అన్ని సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.