Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కందుకూరు
సీఐటీయూ మండల కమిటీ నూతన కన్వీనర్‌గా బుట్టి బాలరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు సీఐటీయూ జిల్లా కోశాధికారి కవిత తెలిపారు. మంగళవారం కందుకూరు మండల కేంద్రంలో ముదిరాజ్ భవనంలో సీఐటీయూ మండల కన్వీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికుల పక్షాన నిలబడి పోరుబాట పట్టాలన్నారు. అన్ని రంగాల కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం చేస్తామన్నారు. అనం తరం కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. సీఐటీయూ కమిటీ సభ్యులుగా బాల్‌రాజుగౌడ్, రాములు, సురేష్, యాదయ్య, రమాదేవి, చెన్నమ్మలను ఎన్నుకున్నట్టు తెలి పారు.అంగన్వాడీ నుంచి సుమతి, సరస్వతి ,రాణి, నియామకం చేశారు. ఆశా కార్యకర్తల నుంచి జయసుధ, వెంకటమ్మ, లక్ష్మీదేవి, సరస్వతి, మధ్యాహ్న భోజన కార్మికుల నుంచి కళ్యాణ్‌కార్ శ్రీను, కిషన్ జి, గీత, కలమ్మ ,ప్రభావతి, ఎలక్ట్రిషన్ రంగం నుంచి గాదె సత్తయ్య, గాదె కుమార్, హమాలిరంగం నుంచి కృష్ణ, రాములు, చెన్నయ్యలను నియా మకం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దుబ్బాక రామచందర్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బి. శ్రీనివాస్, నాయకులు శేఖర్ బాలకృష్ణ పాల్గొ న్నారు. అనంతరం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈనెల 12 నుంచి 28వ తేదీ వరకూ సీఐ టీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే పాదయాత్ర నిర్వహించనున్నట్టు తెలిలపారు.అనంతరం ఈ పాదయాత్ర సందర్భంగా వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు.