Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
ఆనందం ఉద్వేగం, ఆప్యాయతల పలకరింపులు, చిన్ననాటి జ్ఞాపకాలు, చిలిపి ముచ్చట్లు, సెల్ఫీలు, మధురమైన జ్ఞాపకాలతో ఆ ప్రాంతమంతా సందడిగా నెలకొంది. ఆమనగల్ మండలం ఆకుతోటపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1995-96 సంవత్స రంలో పదోవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు దాదాపు 28 ఏండ్ల ఒకే చోట కలుసుకోవడం ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం వారంతా కడ్తల్ మండలం మైసిగండి మైసమ్మ దేవాల యంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకోవడంతో వారి సంతోషాలకు అవధులు లేకుండా పోయాయి. ఒకరినొకరి ఆప్యాయంగా పలకరించుకున్నారు. భవిష్యత్తులో పలు సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్ర మంలో వల్లభ దాస్ వీరేష్గౌడ్, అర్థం ప్రసాద్, మంచు కొండ రాజు, సంతోష్ కుమార్, శ్రీనివాస్, నరసింహ గౌడ్, వీరయ్య, సుధాకర్, రాజశేఖర్, రమేష్, అల్లాజిగౌడ్, బాల స్వామిగౌడ్, అనిత, రాధిక, ఊర్మిళ, వనజ, ప్రభావతి, శోభా రాణి, రోహిణి, పద్మ, మాధురి, అలివేలు, వెంకటమ్మ, స్వప్న పాల్గొన్నారు.