Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఎస్పీ కోటిరెడ్డి
నవతెలంగాణ-మర్పల్లి
మండలంలోని కోట్మర్పల్లిలో దాతల సహాయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయ మని వికారా బాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. బుధవారం సర్పంచ్ విజయలక్ష్మి రాచయ్యతో కలిసి పంచాయతీ కార్యాలయంలో సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్ విజయ లక్ష్మి రాచయ్య శాలువా మెమోంటోతో ఎస్పీ కోటిరెడ్డిని సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో శాంతి భద్రతల పరి రక్షణ కోసం దాతలు ముందుకు రావడం అభినందనీయ మన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సహకరించిన (దాత) అప్కని చంద్రయ్య (ఏలీయా)ను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి సర్పంచ్ విజయలక్ష్మి రాచయ్య శాలువాతో సన్మానించారు. చదువు కున్నవారు గ్రామాభివృద్ధికి సహకరించడం మంచి విష యమని ఇలా ముందుకు వస్తే గ్రామాలు అభివృద్ధి పథంలో నడుస్తాయన్నారు. చంద్రయ్య చూసి అందరూ ముందుకు వచ్చి గ్రామాభి వృద్ధిలో పాల్గొనాలని సూచించారు కార్యక్రమంలో డీఎస్పీ సత్యనారా యణ, సీఐ వెంకటేశం, ఎస్సై అరుణకుమార్ వార్డు మెంబర్లు జైహింద్‌రెడ్డి, రవి, లక్ష్మి, రాహుల్, రఘుపతి రెడ్డి మాజీ పీఎసీఎస్ చైర్మన్, నర్సింహరెడ్డి మాజీ డైరెక్టర్, నర్సింలు మాజీ ఉపసర్పంచ్, ప్రతా ప్రెడ్డి రిటైర్డ్ ఏఎస్ఐ, కృష్ణయ్య, విష్ణు వర్ధనరెడ్డి, నేతాజీ యువజన సం గం అధ్యక్షుడు నర్సింహా, వీవో ఏ.వినోద, తహసీన్, బీఆర్ ఎస్ గ్రామా ధ్యక్షుడు రాజు, ఉపాధ్యక్షుడు ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీశైలం ఆనంతయ్య, రాచయ్య, జిలని, మధు, అప్కని, యాదయ్య, నర్సింహ, గ్రామస్తులు పాల్గొన్నారు.