Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీరు పోకుండా మట్టితో అడ్డుకట్ట
- నాలాలను మింగేస్తున్న రియల్టర్లు
- చూసీ చూడనట్టు వదిలేస్తున్న సంబంధిత అధికారులు
- కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
నవతెలంగాణ-యాచారం
మండల పరిధిలోని తమ్మలోనిగూడ రెవెన్యూకు సంబంధించిన పోతురాజుకుంట నాలా కబ్జాకు గురి అయింది. యదేచ్ఛగాా ఓ భూమి యజమాని చదును పేరుతో పోతురాజు కుంట నాలాలో మట్టి పోసి నింపేశాడు. దీంతో నరసప్ప కుంట నుంచి వచ్చే నీళ్లు పోకుండా అడ్డుకట్ట పడిందని స్థానిక ప్రజలు ఆరోప ిస్తున్నారు. కొంతమంది రియాల్టర్లు భూమి చదును పేరుతో చెరువు నాళాలను మింగేస్తున్నారని స్థానికులు మండి పడుతున్నారు. చెరువు నాలాలను కాపాడడంలో ఇరిగేషన్ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నాలాలను పరి రక్షించే అధికారులు పట్టించుకోకపోతే ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనలతో రాబోయే రోజుల్లో చెరువుల్లో నీళ్లు రాకుండా ప్రమాదం ఏర్పడవచ్చు అని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలాలు కనుమరుగవుతుంటే సంబంధిత అధికారులు ఏం చేస్తు న్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నాలాలను పరిరక్షించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.