Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
నవతెలంగాణ-తలకొండపల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు పలువురు ఆకర్షితులై బీఆర్ ఎస్‌లో చేరుతున్నట్టు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. బుధవారం తలకొండ పల్లి మండలం జూలపల్లి గ్రామానికి చెందిన 10 మంది కాంగ్రెస్ నాయకులు, బీజేపీ హైదరాబాద్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నివాసంలో సర్పంచ్ అలివేలమ్మ, బీఆర్ఎస్ నాయకులు విజరు కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవు తున్నాయని అన్నారు. ప్రతీ కుటుంబానికి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసి బీఆర్ఎస్లో చేరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తలకొండపల్లి మండల మాజీ రైతు కమిటీ అధ్యక్షులు దశరథ నాయక్, గడ్డమీదతండా సర్పంచ్ ఈశ్వర్ నాయక్, వెంకట్రావుపేట్ సర్పంచ్ హైమావతి రమేష్, గోపాల్, మహేష్, వెంకటేష్, మల్లేష్, రమేష్ పాల్గొన్నారు.