Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లింగంపల్లి సర్పంచ్ పేర్క వినోద మూర్తి
నవతెలంగాణ-మంచాల
ప్రజలు వైద్య శిబిరాన్ని సద్వి వినియోగించుకోవాలని లింగంపల్లి సర్పంచ్ పేర్క వినోద మూర్తి అన్నారు. గురువారం మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో కామినేనీ హాస్పిటల్ హైదరాబాద్ వారితో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ శిబిరంలో సుమారు 120 మంది ప్రజలు పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకున్న వారంతా వైద్యుల సలహాలు పాటిస్తూ ఆరోగ్యాలను కాపాడుకోవాలని సర్పంచ్ సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు భూరుగు ఐలేష్ యాదవ్, డాక్టర్లు అఖిల, నవ్య, మాధురి తదితరులు ఉన్నారు.