Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి
- చెల్లంపల్లి గ్రామంలో స్ట్రీట్ కార్నర్ సమావేశం
నవతెలంగాణ-ఆమనగల్
ఎమ్మెల్యే సొంత ఊర్లో లబ్దిదారులు డబుల్ బెడ్రూం ఇండ్లకు నోచుకోక పోవడం చాలా బాధాకరమని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. కడ్తాల్ మండలంలోని చెల్లంపల్లి గ్రామంలో బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ సమావేశానికి ముఖ్య అతిథులుగా తల్లోజు ఆచారి హాజరై, మాట్లాడారు. గ్రామంలో ఇండ్లు లేని నిరుపేద కుటుంబాల కోసం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శిలాఫలకం వేసి ఎనిమిదేండ్లు పూర్తైనా, నేటికి పనులు ప్రారంభం కాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి గ్రామంలో ఇండ్లు లేని పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్ భారత్లో అందరూ తమ పేర్లను నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కండె హరిప్రసాద్, మాజీ ఎంపీపీ వీరయ్య, బీజేపీ మండల అధ్యక్షులు మన్య నాయక్, రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి, జిల్లా నాయకులు భగీరథ, రెడ్యా నాయక్, యాదగిరి, లక్ష్మణ్ నాయక్, సాయిలాల్ నాయక్, శ్రీశైలం, వెంకటేష్, ప్రేమ్ కుమార్, రాందాస్, చందన్, పవన్ రెడ్డి, అంజయ్య యాదవ్, ప్రేమ్ రాజ్, శ్రీను గౌడ్, నరేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.