Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
- కోతుల నుంచి రక్షించాలి : సర్పంచ్
నవతెలంగాణ-దోమ
హరితహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. గురువారం దోమ మండల కేంద్రాన్ని సందర్శించి ప్రభుత్వ కార్యాలాయలను తిరిగి ,ఇరుకుగా ఉన్నాయని కార్యాలయాలు నీట్‌గా ఉంచుకోవాలని తహసీల్దార్ ఎంపీడీఓలకు సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట దోమ సర్పంచ్ కె. రాజిరెడ్డితో మాట్లాడారు. రోడ్ల ఇరువైపులా ఆశించిన స్థాయిలో మొక్కలు లేవనీ, వాటి స్థానంలో మరల మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.అయితే మొక్కలకు నీరు అందిస్తూ బయో ఫెన్సింగ్ కూడా చేశమని, కోతుల బేదడ వల్ల చెట్లు ఇరిగి పోతున్నాయని సర్పంచ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మండల కేంద్రంలో కోతులు వేల సంఖ్యలో ఉన్నాయని వాటి భారీ నుంచి రక్షించాలని సర్పంచ్ కలెక్టర్‌ను కోరారు. ఎంపీడీఓ కార్యాలయంలో అందుబాటులో ఉన్న అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్ లు పని చేయకపోతే అందరిపై చర్యలు ఉంటాయని కలెక్టర్ అన్నారు. అంతకు ముందు దోర్నాల పల్లి గ్రామంలో పర్యటించిన కలెక్టర్ హరితహారంలో నిర్వహిస్తున్న నర్సరీ పల్లె ప్రకృతి వనం నిర్వహణలో విఫలమైన పంచాయతీ కార్యదర్శి ఉపాధి హామీ టెక్నీకల్ అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. కలెక్టర్ పర్యటనతో అన్ని శాఖల అధికారుల్లో అలజడి మొదలైంది.జిల్లాకు నూతనగా వచ్చిన కలెక్టర్ దోమ మండలంను సందర్శించి ఇద్దరినీ సస్పెండ్ చేసి, బాధ్యులపైనా అధికారులకు ఫైన్ విధించినట్టు తెలిసింది. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు దోమ గ్రామ ఉపసర్పంచ్ గోపాల్ గౌడ్, కో-ఆప్షన్ సభ్యులు ఖాజాపాష, బండి సాయిలు, మనోద్దీన్ పాల్గొన్నారు.