Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విపరీతమైన నొప్పితోనూ పాదయాత్ర కొనసాగింపు
- పోచారంలో కొనసాగిన పాదయాత్ర
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ప్రగతి నివేదన పాదయాత్ర చేస్తున్న మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి పాదానికి గాయం మళ్లీ తిరగబెట్టింది. విపరీతమైన వాపు, నొప్పితోనే ఆయన తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న పాదయాత్ర ముందు ఇలాంటి గాయం పెద్ద లెక్క కాదని ఆయన ముందుకు సాగుతున్నారు. తన పాద యాత్ర గురువారం పోచారంలో కొనసాగింది. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ, అభివృద్ధి పనులకు ప్రభుత్వం సుమారు రూ.90.52 కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. ప్రజల వినతి మేరకు 15 రోజుల్లో పోచారం గ్రామానికి ఆర్టీసీ బస్సు పునరుద్ధరణ అయ్యే విధంగా కృషి చేస్తామన్నారు. రైస్‌మిల్స్ అనుమతులను రెన్యూవల్ చేయకుండా గ్రామానికి దూరంగా తరలించా లని గ్రామస్తులు కోరారు. సీసీరోడ్లు, డ్రయినేజీ నిర్మాణం కోసం రూ.5లక్షలు, వంద వీధి దీపాలు మంజూరు చేశా రు. గౌడ సంఘ భవన నిర్మాణానికి మరో రూ.5లక్షలు మంజూరు చేశారు. క్రీడాకారులకు కబడ్డీ, క్రికెట్, వాలీబాల్ కిట్ల పంపిణీ చేశారు. ప్రతి గ్రామానికీ వెళ్లి ప్రజల సమ స్యలు అడిగి తెలుసుకుంటున్నామన్నారు. వాటిని స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరి స్తామన్నారు. ఎంపీపీ పంది కృపేశ్, ఏఎంసీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, జడ్పీటీసీ జంగమ్మ, పీఏసీఎస్ చైర్మన్ మహేం దర్‌రెడ్డి, డైర్టెర్ శ్యాంసుందర్రడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు బూడిద రాంరెడ్డి, నాయ కులు రమేష్, సాగర్, కృష్ణ, రియాజుద్దీన్, తదితరులున్నారు.