Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకర్లకు రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశం
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణిత వ్యవధిలోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్ బ్యాం కర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన అధ్యక్షతన డీసీసీ, డీఎల్ఆర్సీ సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిక్‌జైన్ మా ట్లాడుతూ రంగారెడ్డి జిల్లా రాష్ట్ర రాజధాని శివారు ప్రాంతం కాబట్టి పరిశ్రమలు స్థాపించుటకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారన్నారు. వారికి రుణాలు సకాలంలో అందిచాలని బ్యాంకర్లకు సూచించా రు. రైతులకు బ్యాంకుల ద్వారా అందించే పంట రుణాలు సకాలంలో అందించి వారికి చేయూత నివ్వాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు పూర్తి స్థాయిలో లింకేజీ రుణాలు పంపిణీ చేయాలని, సబ్సిడీ రుణాల పంపిణీలో జాప్యం చేయవద్దని సూచించారు. లబ్దిదారుల ఎంపిక పక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు. వీధి వ్యాపారులకు విరివిగా ముద్ర రుణాలతో పాటు స్టాండ్ అప్ ఇండియా కింద రుణాలు అందించాలన్నారు. పీఎం స్వా నిధి, పీఎంఈ జీపీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌కి సంబంధించిన అన్ని పథకాలు పూర్తి చేయుటకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్‌రావు, ఆర్బీఐ అధికారి, నాబార్డు ఎజీఎం శిబి శర్మ, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ప్రభాకర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి అంజిలప్ప, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రామేశ్వరి దేవి, జిల్లా అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.