Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ భూములకు అవార్డులు
- కాస్తుదారులకు ఎగవేత
- భూసేకరణ పరిహారం పేరుతో రూ. కోట్లు దండుకున్న అక్రమార్కులు
- నిర్లక్ష్యంగా రెవెన్యూ అధికారులు
- విచారణ చేపట్టి, న్యాయం చేయాలని బాధిత రైతుల డిమాండ్
ఫార్మాసిటీలో భాగంగా ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. పలువురు రైతులకు పరిహారం చెల్లించింది. అయితే ఇందులో అసలైన రైతులకు పరిహారం దక్కాలేదు. అక్రమార్కులు రైతుల పేర నకిలీ పత్రాలు సృష్టించి కోట్లు దండుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిహారం తీసుకున్న వారి వివరాలు పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమైంది. ప్రభుత్వ భూములకు, సాగులో లేని నకిలీ పత్రాలకు పరిహారం ఇవ్వడం పలు అనుమానాలకు తవిస్తోంది. ఫార్మాసిటీ భూముల పరిహారం విషయంలో ప్రభుత్వం తక్షణమే విచారణ చేపట్టి, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లాలో మెగా ఫార్మాసిటీ కోసం సుమారు 20 వేల ఎకరాల భూములు సేకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ భూములకు పరిహారం కింద బాధి తులకు అసైన్డ్ భూములకు రూ. 8లక్షలు, పట్టా భూము లకు రూ.16 లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటి వరకు 19,333 ఎకరాలు భూసేకరణ చేసింది. ఇందులో సుమారు 6,500 ఎకరాలు అసైన్డ్ భూములు ఉన్నాయి. యాచారం మండల పరిధిలోని కుర్మిద్ద రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 92 లో 842 ఎకరాలు ప్రభుత్వ భూమిలో 1975, 2005, 2007లలో భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం సుమారు 540 ఎకరాల భూమిని అసైన్డ్ చేసింది. ఇంకా ప్రభుత్వ భూమి సుమారు 300 ఎకరాలు ఉండాలి. ఫార్మాసిటీ భూ సేకరణలో భాగంగా ప్రభుత్వ భూమి కూడా తీసుకున్నారు. అయితే అసైన్డ్ భూముల సాగులో ఉన్న రైతులకు చట్టం నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిందే. కానీ ప్రభుత్వ భూములకు పరిహారం ఎలా ఇచ్చారన్నది ప్రశ్నార్థకం. ఇదే సర్వే నెంబర్లో ఎన్నో ఏండ్లుగా పట్టాలు వచ్చి, సాగులో ఉన్న రైతులకు ఇవ్వకపోవడం రైతుల పట్ల రెవెన్యూ అధికారుల వివక్ష ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
మచ్చుకు సర్వే నెంబర్ 92లో సాటి రాచంద్రయ్య కు టుంబానికి నాటి ప్రభుత్వం 1975లో 32 ఎకరాలు భూ మి అసైన్డ్ చేసింది. ప్రస్తుతం ఆ కుటుంబానికి ఒక్కోరికి రెండు ఎకరాల చొప్పున వస్తోంది. ఫార్మాసిటీ భూసేకరణ వరకు ఆ కుటుంబాలు ఈ భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగించారు. భూ సేకరణ పేరుతో భూములు తీసు కున్న ప్రభుత్వం పరిహారం ఇవ్వకుండా ఈ భూములు ఫా రెస్టు భూములని సాకు చెప్పుతూ పరిహారం ఎగ్గొట్టే ప్రయ త్నం చేస్తోంది. కానీ ఇదే సర్వే నెంబర్లో ప్రభుత్వ భూము లకు పరిహారం ఎట్లా ఇచ్చారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సర్వే నెంబర్ 92లో పలేముల్ కుటుం బంలో ఆరుగురి మహిళాల పేరు మీద 12 ఎకరాల భూమి ఉంది. ఈ భూములు ఫార్మాసిటీలో పోయాయి. ఆ కుటుంబాలకు పరిహారం ఇవ్వడం లేదు. కానీ సాగులోని రైతులకు నకిలీ పత్రాలకు పరిహారం ఇవ్వడం బాధితులను ఆందోళనకు గురిచేస్తోంది.
92 సర్వే నెంబర్లో 3 ఎకరాలు భూమికి 2016లో పరిహారం తీసుకున్న సదరు రైతు.. 2021లో మరో నాలు గు ఎకరాలకు పరిహారం తీసుకున్నారు. ఆ రైతు పేరున ఉన్నది మాత్రం 3 ఎకరాల భూమి మాత్రమే.. మరో నాలు గు ఎకరాల పరిహారం ఎట్లా వచ్చిందన్నదే ప్రశ్నార్థకం. దీనిపై రెవెన్యూ అధికారులతో మాట్లాడితే రికార్డులు చూ స్తాం. పరిశీలించి చెప్పుతామనడం తప్పా సరైన సమా ధానం ఇవ్వకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది.