Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్లోనే కొనసాగుతా
- డీసీసీబీ చైర్మన్ బుయ్యాని మనోహర్‌రెడ్డి
- పార్టీ బలోపేతానికి కృషి చేస్తా
- ఎండి షోయబ్
నవతెలంగాణ-పరిగి
కార్యకర్తల జోలికి వస్తే ఉరుకునేది లేదని డీసీసీబీ చైర్మన్ బుయ్యాని మనోహర్‌రెడ్డి అన్నారు. గురువారం పరి గి మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో బీఎంఆర్‌తో ఆత్మీ య సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పరిగి నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షుడు ఎండి షోయబ్ దాదాపు 300 మంది కార్యకర్తలతో బుయ్యాని మనోహర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సం దర్భంగా బస్టాండ్ నుంచి సుల్తాన్‌పుర్ వరకు ర్యాలీ నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక ర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కొంతమంది నాయకు లు కావాలని తన వెంటే వచ్చే నాయకులను రాని వ్వకుం డా బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఎవ రెన్ని కుతంత్రాలు పన్నిన తననేమి చేయలేరని అన్నారు. తన కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, అవన్నీ గురు ్తపెట్టుకొని వడ్డీతో సహా తీరుస్తామని హెచ్చరించారు. బీజేపీలోకి వెళ్తున్నానని కావాలని అసత్య ప్రచారాలు చేస్తు న్నారని అన్నారు. బీజేపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్లోనే ఉంటామని, అధిష్టానం సూచన మేరకు నడుచుకుంటానని తెలిపారు. షోయబ్‌ని కూడా తన వెంట రానివ్వకుండా ఎంతో ఒత్తిడి చేశారని అన్నారు. త్వరలోనే కేటీఆర్ సమక్షంలో షోయబ్, అతని అనుచరులు భారీ ఎత్తులో బీఆర్ఎస్ కండువా కప్పుకుంటారని తెలి పారు. ఇంకా చాలామంది తన వెంట రావడానికి సిద్ధంగా ఉన్నారని కానీ వారిని రానివ్వకుండా చేస్తున్నారని అన్నా రు. ఎవరు కూడా భయపడకూడదని అందరి వెంట ఉం టానని హామీ ఇచ్చారు. కార్యకర్తలు అందరూ పార్టీ బలో పేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా షోయబ్ మాట్లాడుతూ డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతామని తెలిపారు. ఇంకా చాలామంది కార్యకర్తలు బీఎంఆర్ నాయకత్వంలో నడిచేం దుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. త్వరలో వారందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొస్తామని అన్నారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటు తన వంతు సహాయ, సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ యాదయ్యగౌడ్, నార్మల్ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాఘవేం దర్‌రెడ్డి, నరేష్‌యాదవ్, గిరిధర్‌రెడ్డి, నర్సిరెడ్డి, ఎంపీటీసీలు రాంలాల్, ఆంజనేయులు, మేగులయ్య, మైనార్టీ యువకులు, తదితరులు పాల్గొన్నారు.