Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎరుపుల గాలయ్య
- పలు పాఠశాలల్లో ప్రచారం
నవతెలంగాణ- చేవెళ్ల
మార్చి 13న జరగబోయే రంగా రెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ నియో జకవర్గానికి సంబంధించిన శాసనమండలి ఎన్నికలలో ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల మద్దతుతో బరిలో దిగుతున్న టీఎస్‌యూటీఎఫ్ సీనియర్ రాష్ట్ర నాయకుడు పాపన్నగారి మాణిక్‌రెడ్డిని గెలిపించాలని రాష్ట్ర కార్యదర్శి ఎరువులు గాలయ్య ఉపాధ్యాయులను కోరారు. గురువా రం చేవెళ్ల మండలంలోని కందవాడ, గుండాల, చన్వెల్లి, ఖానాపూర్, ఆలూర్, అంతారం, కౌకుంట్ల, తంగడిపల్లి, కొత్తపల్లి పాఠశాలలను సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కా ర్యదర్శులు గోపాల్ నాయక్, వెంకటప్పులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మాణిక్ రెడ్డి నీతి, నిజాయితీతో ఉపాధ్యాయుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో 33 ఏండ్ల పాటు రంగారెడ్డి జిల్లాలో ఉపా ధ్యాయ ఉద్యమ నాయకులుగా పని చేశారని తెలిపారు. వారికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి శాసనమండలికి పంపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉపాధ్యాయుడిపైన ఉందన్నారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని పట్టించుకోవడంలేదని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు రోజురోజుకూ పెరిగిపో తున్నాయని అన్నారు. జిల్లా అధ్యక్షులు గోపాల్‌నాయక్ మాట్లాడుతూ పాఠశాలల్లో కనీసం స్వీపర్లను కూడా నియమించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఈ సమస్యలపై ప్రశ్నించడానికి శాసనమండలిలో మాణిక్‌రెడ్డి ఉండాల్సిన అవసరం ఉందని వారన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటప్ప మాట్లాడుతూ.. దాచురి రామిరెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డిల ఉద్యమ సహచరుడిగా కలిగిన నిష్ప క్షపాతంగా న్యాయం కోసం నిలదీసే నాయకుడు మాణి క్‌రెడ్డి అని కొనియాడారు. శాసనమండలిలో తన గళాన్ని వినిపించి ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి ఉపాధ్యాయ, అ ధ్యాపకుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసే నాయ కుడిని ఎమ్మెల్పీగా గెలిపించాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి మహమ్మద్ అక్బర్ మాట్లాడుతూ 317 జీవో కారణంగా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను దశలవారీగానైనా సొంత జిల్లాలకు బదిలీ చేయాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం చేy ెళ్ల మండల, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గణేష్, లాలయ్య, జిల్లా కార్యదర్శి నాగేంద్రం, మండల కార్యవర్గ సభ్యులు ప్రవీణ్, విజయ్ కుమార్, వెంకటేష్ పాల్గొన్నారు.