Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాజేందర్‌నగర్
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుని కంట్లో కారం చల్లి, అతని వద్ద ఉన్న పది లక్షల బ్యాగును దుండగులు లాక్కొని వెళ్లారు. ఈ ఘటన రాజేందర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీ సులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం నారాయణ పేట ప్రాంతానికి చెందిన జ్యువెలరీ వ్యాపారి శివ శుక్రవా రం బంగారం కొనడానికి రూ.10 లక్షల బ్యాగ్‌తో నారా యణపేట నుంచి హైదరాబాద్ ఆర్టీసీ బస్సులో ప్రయాణి స్తున్నాడు. బస్సు శివరాంపల్లి వద్దకు రాగానే బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు బస్సు ముందు బైక్ ఆపారు. బైక్‌పై ఉన్న ఒక వ్యక్తి శివ వద్దకు వచ్చి కంట్లో కారం చల్లాడు. అతని చేతిలో ఉన్న బ్యాగును లాక్కొని కిందకు దిగుతుండగా అడ్డుకోబోయిన కండక్టర్‌ను తోసి కిందకు దిగాడు. వెంటనే చేరుకున్న శివ ఆ దొంగని పట్టుకోడానికి ప్రయత్నించగా అతడు కత్తితో బెదిరించడంతో శివ వెనక్కు తిరిగాడు. దొంగలు అక్కడ నుంచి పరారయ్యారు. వెంటనే శివ రాజేందర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. జనం నిత్యం రద్దీగా ఉండే శివరాంపల్లి ప్రాంతంలో ఏకంగా దొంగలు బస్సు ఆపి దొంగతనానికి పాల్పడడంతో స్థానికులు భయందోళన వ్యక్తం చేశారు.