Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి మాణిక్‌రెడ్డి
నవతెలంగాణ-గండిపేట్
సరార్ బడులను బలోపేతం కోసం పెద్దల సభలో ప్రశ్నించే గొంతును ఎమ్మె ల్సీగా తమను గెలిపించాలని టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డి కోరారు. శుక్రవారం గండిపేట్ మండలం మణికొండ ప్రభుత్వ పాఠ శాల ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను, పేద ఉపాధ్యాయుల కోసం ఎమ్మెల్సీగా కృషి చేస్తామన్నారు. ఉపాధ్యాయుల సమస్యల కోసం క్రియాశీలక పాత్ర పోషించామన్నారు. భవిష్యత్తులో ఉపాధ్యాయుల సమస్యల కోసం సంఘాలతో కలిసి పని చేస్తామన్నారు. సమస్యల కోసం ప్రశ్నించే గొంతును ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గోపాల్నా యక్ గండిపేట్ మండల అధ్యక్షులు ఎండి మాజీద్, కార్యదర్శి రజిని, శేర్లింగంపల్లి ఉపాధ్యాయ నేతలు, తదితరులు పాల్గొన్నారు.