Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
తాండూర్ మండలం గుంత బాచుపల్లి గ్రామ శివారులోని ఇండోస్ కెమికల్ ఫ్యాక్టరీలో కెమికల్ డ్రమ్ములు ఎండకు ఒక్కసారిగి పేలాయి. దీంతో ఫాక్టరీలో మంటలు వ్యాపించాయి. వెంటనే పైర్ సిబ్బందికి సమాచారం అం దించారు. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు అర్పే ప్రయత్నం చేశారు. అయినా అదుపులోకి రాలేదు. ఫ్యాక్టరీ మొత్తం కాలిపోయింది. ఇదిలా ఉంటే ఈ ఫ్యాక్టరీ వెదజల్లే దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫ్యాక్టరీ మూ సివేయాని నెల రోజుల క్రితం గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. అయినా ఎవ్వరు పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రమాదంలో ఫ్యాక్టరీ కాలిపోవడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.