Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకవైపు మురుగునీరు, మరోవైపు పందుల బెడద
- బహిరంగంగా మూత్ర విసర్జన
- పట్టించుకోని ఆర్టీసీ అధికారులు
- ప్రయాణికులకు ఇక్కట్లు
నిత్యం వందలాదిమంది ప్రయాణికులతో కిటికిటలాడే పరిగి ఆర్టీసీ బస్టాండ్ అధికారుల నిర్లక్ష్యంతో కంపు కొడుతోంది. పరిగి వాణిజ్య కేంద్రం కావడంతో పాటు వివిధ ప్రయివేటు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ప్రజలు పరిగి వస్తుంటారు. బస్టాండ్‌లో దుర్వాసన, పందులు, మురుగునీటి గుంటలు, బహిరంగ మూత్ర విసర్జన వల్ల పరిసరాలన్నీ అపరిశుభ్రంగా మారిపోయాయి. పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా మారినా అధికారులు అటువైపు చూడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు స్పందించి వెంటనే బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
నవతెలంగాణ-పరిగి
బస్టాండ్ ఆవరణకు ఆనుకుని ఉన్న ఓ వాటర్ ప్లాంట్ వృథా నీరు బస్టాండ్‌లోకి చేర డంతో పాటు, మున్సిపల్ కాంప్లెక్స్ వాణిజ్య స ముదాయంలోని మురుగునీరు బస్టాండ్‌లో వ చ్చి చేరడంతో బస్టాండ్‌లో ఎక్కడపడితే అక్కడే నీరు నిలిచిపోయింది. నీరు భారీగా నిలిచి మురికి గుంటలుగా మారిపోయాయి. షాద్న గర్ ప్లాట్ఫారానికి పక్కనే ఈ మురికి కుంటలు ఉండడంతో ప్రయాణికులు పడరాన్ని పాట్లు పడుతున్నారు. దాని నుండి వచ్చే దుర్వాసనకు తట్టుకోలేక ముక్కులు మూసుకుంటున్నారు.
పందుల స్వైర విహారం
పరిగి ఆర్టీసీ బస్టాండ్‌లో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. బస్టాండ్‌లో ఎక్కడప డితే అక్కడ సంచరిస్తూ ప్రయాణి కులను ఇబ్బందికుల గురిచేస్తున్నాయి. అంతేకాకుండా మురికి గుంటల్లో పందులు తిరగడం వల్ల బస్‌స్టాండ్ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా మారాయి. ఎక్కడపడితే అక్కడ మలమూత్ర విసర్జన చేస్తున్నాయి. అంతేకాకుండా ప్రయా ణికుల మధ్యలో నుండి సంచరిస్తూ అటూ ఇ టూ తిరుగుతున్నాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. పందులు ఉండడానికి బస్టాండ్ అనుకూలంగా ఉండడం తో పందులు గుంపులు గుంపులుగా వాటి పిల్ల లతో అక్కడ నివసిస్తున్నాయి. అధికారులు స్పందించి పందులను నివారించాలని ప్రయా ణికులు కోరుతున్నారు.
బహిరంగ మూత్ర విసర్జన
పరిగి బస్టాండ్‌కు నిత్యం వేలాది మంది ప్రయాణికులు వస్తుంటారు. వారికి సరిపడా టాయిలెట్స్ లేకపోవడంతో చాలామంది బస్టాండ్‌లో బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నరు. తద్వారా బస్టాండ్ పరిసర ప్రాంతాలు కంపు కొడుతున్నాయి. దీనితో ప్రజలు, విద్యార్థినీ, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ప్రయాణికులకు అనుగుణంగా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరుకుం టున్నారు.
ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
హౌటలో నుండి వచ్చే నీరు బస్టాండ్ లో వచ్చి చేరుతుంది. పరిగి బస్టాండ్‌లో కలిషితమైన నీరు రావడంతో ప్రజలు రోడ్డుపై తిరగలేని పరిస్థితి ఏర్పడింది. దుర్గంధంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. ఎక్క డపడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తున్నారు. కాబట్టి 2,3 టాయిలెట్స్ నిర్మించాలి. ప్రభుత్వం గుంతల్లో మట్టి పోసి, సీసీరోడ్లు వేయవచ్చు. కానీ ప్రభుత్వం ఏ అభివృద్ధీ చేయడం లేదు. రాష్ట్రంలో చాలా బస్టాండ్‌ల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. సీిఎం కేసీఆర్, హరీష్‌రావు, కవిత నియోజక వర్గం బస్టాండ్‌లో బాగున్నాయి. చాలా ప్రాంతాల్లో బస్టాండ్లు అధ్వా నంగా ఉన్నాయి. కా వాలని నిర్లక్ష్యం వహిస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సౌక ర్యాలు కల్పించాలి.
- హనుమంతు ముదిరాజ్ టీజేఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి