Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా రవాణా అధికారి వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-పరిగి
వాహనదారులు సకాలంలో పన్ను చెల్లించా లని జిల్లా రవాణా అధికారి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం రూ.4,769 పన్ను చెల్లించని వాహనాలు తిరు గుతున్నాయని తెలిపారు. ఈ వాహనాలు తనిఖీ ల్లో పట్టుబడితే రూ.200 శాతం అపరాధ రుసుం తో మొత్తం రూ.300 శాతం పన్ను చెల్లించవలసి వస్తుందని పేర్కొన్నారు. ఈ మొత్తం వాహనాలకు సంబం ధించి దాదాపు రూ.3,50,23,190 బకాయి ఉందని తెలి పారు. వాహన యజమానులు వెంటనే పన్ను బకాయి చెల్లించాలని సూచించారు. రవాణా వాహనాల పన్నులు కోట్ల రూపాయల్లో పేరుకుపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక తనికులు ముమ్మరం చేశామని తెలిపారు. ప్రతీ 3 నెలలకు ఒకసారి ప్రయాణ వాహనాల యజమానులు పనులు చెల్లిం చకపోవడంతో బకాయిలు భారీ గా పెరిగిపోయాయని పేర్కొ న్నారు. మార్చి వరకూ పూర్తి పన్ను బకాయి వసూలు చేసే విధంగా వికారాబాద్ జిల్లావ్యా ప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహి స్తున్నామని తెలిపారు. బకాయి ఉన్న వాహనదారులు మీ సేవాకేంద్రాల ద్వారా పన్ను చెల్లిస్తే రూ.50శాతం అపరాధ రుసుముతో చెల్లించవలసి ఉం టుందని తెలిపారు. ఒకవేళ అధికారుల తనిఖీల్లో పట్టు బడితే రూ.200 శాతం అదనంగా చెల్లించవలసి ఉంటుం దని తెలిపారు.