Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ కేవీ జిల్లా అధ్యక్షులు భూమొళ్ళ కృష్ణయ్య
నవతెలంగాణ-కొడంగల్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి చెల్లించవలసిన డబ్బులు ఇవ్వక పోవడం మూలంగానే గ్రామపంచాయతీ ఉద్యో గులకు, కార్మికులకు సంబంధించిన జీతాలు రాక ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారని బీ ఆర్ఎస్ కేవీ జిల్లా అధ్యక్షులు భూమొళ్ళ కృష్ణయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లా డుతూ బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి రావలసి న డబ్బులు చెల్లించాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ ఉద్యోగులకు నెలలు నెలలు జీతాలు పెండింగ్లో ఉన్న కారణంగా వాళ్ల కుటుం బాలను పోషించుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ ఉద్యోగులకు జీతాలు రావడం లేదని, పెండింగ్ జీతాలు ఇప్పించాలని డీపీఓకు అనేక సార్లు చెప్పినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరి స్తున్నాడనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పంచా యతీ జిల్లా అధికారులు స్పందించి వెంటనే పెండింగ్ జీ తాలు ఇప్పించాలని డిమాండు చేశారు. జిల్లా వ్యాప్తంగా జీతాలు చెల్లించే వరకు గ్రామా ల్లో పనులు చేయరని హెచ్చరిం చారు. కొన్ని గ్రామ పంచాయతీ ల్లో డబ్బులు ఉన్నప్పటికీ సర్పం చులు, కార్యదర్శులు జీతాలు ఇవ్వడం లేదని కృష్ణయ్య ఆవేదన వ్యక్తంచేశారు. డబ్బులున్న గ్రామ పంచాయతీలు పంచాయతీ ఉద్యో గులకు జీతాలు వెంటనే చెల్లిం చాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామంచాయతీ ఉద్యోగులకు జీతాలు పెంచి వారి గౌర వాన్ని కాపడిందని గుర్తుచేశారు. వారికీ రావలసిన 30 శాతం పీఆర్సీ త్వరలో నే వస్తుందని తెలంగాణ ప్రభు త్వం గ్రామ పంచాయతీ ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉందన్నారు. గ్రామ పంచాయతీ ఉద్యోగులు ధర్నాలు చేయకూడదని ధర్నాలు చేసి ఇబ్బందులు పడకూడదని హితవు పలికారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడం లో బీఆర్ఎస్ కార్మిక విభాగం ముందుందని గుర్తుచేశారు. త్వరలోనే గ్రామ పంచాయతీ ఉద్యోగులకు పెండింగ్ జీ తాలు వచ్చే విధంగా బీఆర్ ఎస్ కార్మిక విభాగం కృషి చేస్తుందని కృష్ణయ్య హామీ ఇచ్చారు.