Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డైరక్టర్ల డిమాండ్ చైర్మన్ వైఖరిని నిరసిస్తూ
- సమావేశంలో రైతుల ఆందోళన
- మద్దతు పలికిన కాంగ్రెస్, బీజేపీ స్వతంత్ర డైరక్టర్లు
- చైర్మెన్, వైస్ చైర్మెన్లను సస్పెండ్ చేయాలని తీర్మానం
- రసభసాగా పీఏసీఎస్ సర్వసభ్య సమావేశం
నవతెలంగాణ-మంచాల
పీఎసీఎస్ చైర్మెన్, వైస్ చైర్మెన్లు కలిసి ధాన్యం కొనుగోలులో రూ.35 లక్షలు అవినీతికి పాల్పడ్డారనీ, వారిని వెంటనే సస్పెండ్ చేసి, అవినీతి పాల్పడిన డబ్బులు రికవరీ చేయాలని పీఏసీఎస్ డైరక్టర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడుతూ పీఏసీఎస్ చైర్మెన్,వైస్ చైర్మెన్లు ఇద్దరు కలిసి ధాన్యం కొనుగోలులో రూ.35 లక్షలు, అవినీతికి పాల్పడినారని అన్నారు. అలాగే నూతన భవనం నిర్మాణంలో, ఇతర ఖర్చుల విషయంలో మొత్తం సుమారుగా రూ.51 లక్షలు అవినీతికి పాల్పడినట్టు ఆరోపించారు.ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలని సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించినట్టు గుర్తు చేశారు. అవినీతికి పాల్పడిన చైర్మెన్, వైస్ చైర్మెన్లపై అవిశ్వాసం పెట్టాలని డీసీవో ధాత్రిదేవి లెటర్ అందజేసినట్టు తెలిపారు.
సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్న సందర్భంగా రైతులు తమ సమస్యలు తెలియజేస్తుంటే, జరిగిన అవక తవకలపై చర్చిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రైతులపైకి దాడికి పాల్పడటం సరైంది కాదన్నారు. ఈ సమావేశంలో గొడవలు సృష్టించి రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా చైర్మెన్, వైస్ చైర్మెన్ అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారు.ఇప్పటికైనా సబంధిత అధికారులు వెంటనే స్పందించి, పీఏసీఎస్ చైర్మెన్, వైస్ చైర్మెన్లను సస్పెండ్ చేయాలని అవినీతికి పాల్పడిన డబ్బులను రికవరీ చేయాలని తీర్మానించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు డి.ఆరునమ్మ, వి.రామచంద్ర రెడ్డి, జె. వెంకటేశ్, వి. హనుమంతరెడ్డి, కె. జనార్ధన్‌రెడ్డి, ఎస్.వేణు గోపాల్‌రావు, పి.రమేష్, పి.మనెమ్మా తదితరులున్నారు.