Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తలకొండపల్లి
తలకొండపల్లి మండలంలోని తల్లీదండ్రులు తమ పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంగన్వాడీ సిబ్బంది సూచనలు పాటించాలని సర్పంచ్ కెంచ హైమావతి రమేష్ అన్నారు. శుక్రవారం వెంకట్రావుపేట గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో స్థానిక సర్పంచ్ కెంచ హైమావతి రమేష్ ఆధ్వర్యంలో చిన్నారి బాలబాలికలకు అన్నప్రాసన చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యమునా, ప్రధానో పాధ్యా యురాలు రాజ్యలక్ష్మి, ఆశావర్కర్ కొమరమ్మ, ఆయా బాలమణి తదితరులు పాల్గొన్నారు.