Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నేత కసిరెడ్డి భాస్కరరెడ్డి
నవతెలంగాణ-చందానగర్
గౌతమీనగర్ కాలనీ, 2-35లో వేస్తున్న రోడ్డు నాణ్యతాప్రమాణాలపై సర్కిల్ 21 ఏఈ సంతోష్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర నేత కసిరెడ్డి భాస్కరరెడ్డి నిలదీశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఫోన్ ద్వారా ఏఈ దృష్టికి తీసుకెళ్లారు. ఏఈ, డీఈ ప్రవీణ్‌తో కలిసి రోడ్డు పరిశీలించారు. తదనంతరం పాత సీసీరోడ్డుపైన ఉన్న దాదాపు ఒక ఫీటు మట్టిని తొలగించాల్సిందేనని డీఈ ప్రవీణ్ అంగీకరించారు. నాణ్యత డొల్లతనం బయటపడింది. ఈ సందర్బంగా వెంటనే ఉన్న మట్టిని తొలగించాలని ఫోన్ ద్వారా అధికారులు కాంట్రాక్టరును ఆదేశించారు.