Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పిన ప్రమాదం
నవతెలంగాణ-కోట్‌పల్లి
కోట్‌పల్లి మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామంలో ఉన్న బృహత్ పల్లె ప్రకృతి వనం పరిసరాల్లో అంటుకున్న మంటల వలన దాదాపు 50 ఎకరాలలో మంటలు వ్యాపిం చాయి. దీనివలన పక్కనున్న బీడు భూముల నుంచి పల్లె ప్రకృతి వనం లోనికి రాత్రికి రాత్రి మంటలు వ్యాపించిన విషయాన్ని తెలుసుకున్న కోట్‌పల్లి ఎంపీడీఓ లక్ష్మీ నారాయణ, సిబ్బంది, ఉపాధిహామీ టెక్నికల్ అసిస్టెంట్ హరి ప్రసాద్, తదితరులు అక్కడికి చేరుకున్నా రు. మంటల వేడికి పల్లె ప్రకృతి వనం లోని కొన్ని మొక్కల ఆకులు వాడిపో యాయి. వాటి కాండం మాత్రం పచ్చ గానే ఉండడంతో ప్రస్తుతం వాటికి గ్రామపంచా యతీ ట్యాంకర్‌తో పాటు మరొక ట్యాంకర్ పెట్టి నీరు పోయిం చామని ఎంపీడీఓ తెలిపారు. దీని అంచనా వ్యయం రూ.44 లక్షల 65 వేల 98 ఉండగా కానీ ఇందులో ఖర్చు అయినది మాత్రం రికార్డు ప్రకారం రూ.ఆరు లక్షల 77 వేల 421 మాత్రమే అని తెలిపారు. సర్వైవల్ అయిన మొక్కలు 12,341 ఉండగా ఇందులో పాక్షికంగా దెబ్బతిన్న మొక్కలు 1,890 మాత్రమేనని వీటికి కాండాలు కూడా పచ్చిగానే ఉన్నాయని తెలిపారు. వాటికి నీటిని అందిస్తూ సంరక్షిస్తామని తెలిపారు. ఎలాంటి నష్టం జరగలేదన్నారు.